విశాఖలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ నైట్ స్టే
విశాఖ పట్టణంలోని విమాన ప్రయాణికుల కోరిక ఇప్పుడు నెరవేరుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయంగా పూర్తిస్థాయి ప్రమాణాలను అందిపుచ్చుకున్న విశాఖపట్నం ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుంచి కొత్తశకానికి తెరతీస్తుంది. ఎయిర్ ఇండియా విమానం నైట్ పార్కింగ్ విశాఖ ఎయిర్ పోర్టులో జరగనుంది.
ఆంధ్రప్రదేశ్లో మూడు ముఖ్యప్రాంతాలకు, మరో మూడు రాష్ట్రాలకు కూడా అనుసంధానంగా మారుబోతుంది. ఆంధ్రా, ఒడిశా, రాయ్పూర్ రాష్ట్రాలను కలుపుతూ ఎయిర్ ఇండియా విమానం ఏటీఆర్కు సంబంధించిన ఈ ప్రకటన విమానయానం చేసే వారికి తీపి కబురుగా మారబోతోంది. ఈ విమానం ఉదయం ఆరున్నర గంటలకు ఆర్థిక రాజధాని విశాఖపట్టణం నుంచి బయలుదేరుతుంది. పొలిటికల్ రాజధాని విజయవాడ మీదుగా ఆధ్మాత్మిక రాజధాని తిరుపతి చేరుకుంటుంది. తిరిగి తొమ్మిది గంటల తరువాత తిరుపతి విశాఖ ప్రారంభమై విజయవాడ మీదుగా విశాఖ చేరుకుంటుంది. మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ బయలు దేరుతుంది. విశాఖ వచ్చి తిరిగి సాయంత్రం సుమారుగా నాలుగున్నర గంటలకు రాయ్పూర్ వెళుతుంది. మళ్లీ రాయపూర్ నుంచి విశాఖపట్నం చేరుకుంటుంది. దీంతో ఈ ఎయు ఏర్ ఇండియా ఏఈఆర్ విమానం ఆర్థిక రాజధాని పొలిటికల్ రాజధాని, ఆధ్మాత్మిక రాజధానులకు అనుసంధానంగా మారడమే కాకుండా మూడు రాష్ట్రాలను కలుపుతూ సాగడం ఇందులోని ప్రత్యేకత. ఈ సదుపాయం ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
దీంతో చాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ ఓ. నరేష్ కుమార్, అధ్యక్షులు సా ంబశివరావులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ ధన్యవాదాలు తెలియజేశారు.













