ఎవరికీ దక్కని రెండాకులు!
తమిళనాడులో అమ్మ జయలలిత వారసత్వం కోసం పోరాడుతున్న శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలకు ఎన్నికల కమిషన్‌లో చుక్కెదురైంది. అన్నాడిఎంకె ఎన్నికల గుర్తయిన రెండాకులను స్తంభింపజేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలను వేర్వేరు గుర్తులను కేటాయించాలని నిర్ణయించడంతో పాటు పార్టీల పేర్లను కూడా మార్చింది. జయలిత మృతితో ఖాళీ అయిన ఆర్కె నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. శశికళ వర్గానికి టోపి గుర్తును కేటాయించిన ఇసీ ఆ వర్గాన్ని ఏఐడిఎంకే అమ్మా పార్టీగా పిలవాలని పేర్కొంది. అలాగే పన్నీర్‌సెల్వం వర్గానికి విద్యుత్ స్తంభం గుర్తును కేటాయిస్తూ, ఆ వర్గాన్ని ఏఐడిఎంకె పురచ్చితలైవి అమ్మా పార్టీగా పిలవాలని పేర్కొంది. ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్స్‌గా ప్రకటించిన గుర్తుల జాబితాను నుంచి ఆయా వర్గాలు ఎంచుకున్న ఈ గుర్తులకు కేటాయించారు. ఏప్రిల్ 12న జరిగే ఆర్కెనగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రెండు వర్గాలు ఈ గుర్తులపైనే పోటీ చేయాలని సృష్టం చేసింది.













