యూపీ సీఎం సంచలన నిర్ణయం… రోడ్లపై ఉన్న ..
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్లపై ఉన్న అన్ని మతాల ప్రార్థనాలయాలను తొలగించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లు, పోలీసు అధికారులను ఆదేశించారు. రహదారులను ఆక్రమిస్తూ అక్రమంగా నిర్మించిన అన్ని మతాల ప్రార్థనాలయాలపై కఠిన వైఖరి తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, పోలీసు అధికారులు కలిసి రహదారులను ఆక్రమిస్తూ నిర్మించిన తమ స్థలాలను తొలగించేందుకు డోజర్లను రంగంలోకి దించాలని నిర్ణయించారు. రోడ్లపై నిర్మించిన వివిధ మతాల ప్రార్థనాలయాలపై మార్చి 14వ తేదీలోగా నివేదిక సమర్పించాలని యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి అవినీష్ అవస్థీ జిల్లా మెజిస్ట్రేట్లకు రాసిన లేఖలో ఆదేశించారు.













