ఢిల్లీ, పంజాబ్ ఇచ్చినట్లుగా.. గుజరాత్ లో కూడా
ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని గుజరాత్ ప్రజలను ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అభ్యర్థించారు. గుజరాత్‌ను బీజేపీ 25 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నా రాష్ట్రంలో అవినీతి అంతం కాలేదని విమర్శించారు. బీజేపీ అహంకారపూరిత పార్టీ. ప్రజల సమస్యలు పట్టించుకోదు ఆప్‌కి అవకాశం ఇవ్వండి. ఢిల్లీ, పంజాబ్ ఇచ్చినట్లుగా గుజరాత్ కూడా మాకు ఒక అవకాశం ఇవ్వాలి అని అహ్మదాబాద్ రోడోష్లో కేజ్రీవాల్ అభ్యర్థించారు. గుజరాత్లో రెండు రోజుల పర్యటనలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి కేజ్రీవాల్ పాల్గొంటున్నారు. గుజరాత్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.













