యుద్ధ విమానం ఎక్కిన ఉపరాష్ట్రపతి
కర్నాటక రాజధాని బెంగుళూరులో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) కంపెనీ కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందర్శించారు. తేజస్తో పాటు లైట్ కంబాట్ హెలికాప్టర్లు తయారు అవుతున్న ఉత్పత్తి కేంద్రాలను ఆయన పరిశీలించారు. అయితే ఆ సమయంలో తేజస్ యుద్ధ విమానంపై ఉపరాష్ట్రపతి ఎక్కి కూర్చుకున్నారు. పైలట్లు కూర్చూనే సీటులో కూర్చున వెంకయ్య నాయుడు ఆ యుద్ధ విమాన శక్తిసామర్థ్యాలు అడిగి తెలుసుకున్నారు. హెచ్ఏఎల్ కార్యక్రమంలో కర్నాటక గవర్నర్ థావ్చాంద్ గెహ్లాట్ కూడా పాల్గొన్నారు.













