11 నుంచి 19 వరకు అమెరికాకు విమానాలు
ఈ నెల 11 నుంచి 19 వరకు వందేభారత్ మిషన్ కింద అమెరికాకు 36 విమానాలు నడపనున్నట్టు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఈ మేరకు సోమవారం (జులై 6) నుంచి ఎయిర్ ఇండియా వెబ్సైట్లో విమాన టికెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించింది. ఇంతకు ముందు ఈ నెల 3 నుంచి నాలుగో దశ వందేభారత్ మిషన్ కింద 1.50 లక్షల మంది భారతీయులను స్వదేశానికి 700 విమానాల ద్వారా చేర్చినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరించింది. ఇదే నాలుగోదశ కింద కెనడా, అమెరికా, బ్రిటన్, కెన్యా, శ్రీలంక, ఫిలిప్పైన్స్, దక్షిణాఫ్రికా, రష్యా, ఆస్ట్రేలియా, మయన్మార్, జపాన్, ఉక్రెయిన్, వియత్నాంలను భారత్కు కలుపుతూ 170 విమానాలను నడపనున్నది.













