గుజరాత్ ఘటన మరువకముందే.. యూపీలో మరో ఘటన
గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీలో కేబుల్ బిడ్జ్రి కుప్పకూలి 132 మంది ప్రాణాలు పొగొట్టుకున్న ఘటన మరువకముందే, ఉత్తరప్రదేశ్లో అట్లాంటిదే మరో ఘటన జరిగింది. యూపీలోని చందౌలి జిల్లా సరయ్యా గ్రామంలో ఛఠ్ పూజ సందర్భంగా ఓ కాలువపై నిర్మించిన బ్రిడ్జిపైకి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పాత బడిన ఆ వంతెన బరువును తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయంగానీ, ఎవరూ గాయపడటం గానీ జరుగలేదు. వంతెన కూలిన సమయంలో కాలువలో ప్రవాహం పెద్దగా లేకపోవడం, ఎవరూ నీళ్లలో పడిపోకుండా కూలిన వంతెనపైనే ఉండడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. గుజరాత్, యూపీ ఘటనలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.













