సిద్ధరామయ్య సంచలన ప్రకటన … రాబోయే అసెంబ్లీ ఎన్నికలే
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు చివరి ఎన్నికలని తెలిపారు. ఆ తర్వాత కూడా రాజకీయాల్లో కొనసాగుతానని, ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని స్పష్టత ఇచ్చారు. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటం, కాంగ్రెస్ పార్టీలో సీఎం కూర్చీ కోసం పోటీ ఉందని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో సిద్ధరామయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీ కాలపరిమితి మే 24వ తేదీతో ముగియనుంది. దీంతో ఇప్పటి నుంచే ఎన్నికల వేడి రాజుకుంటోంది.













