“తెలుగు రత్న దీపాల వెలుగు”
మేము తెలుగు అక్షర సంపన్నులం..
భాష మీద పట్టునోల్లం
లక్షల తెలుగు అక్షరాలు కలిగిన ధనికులం!!…
ఆత్మీయతను తట్టిలేపుతాం
మా గుమ్మం నిండా
తెలుగుభావాలరాశులు…
మామనుసునిండా
తెలుగుతల్లి తేనేపలుకులే
కీర్తి ప్రతిష్టలే మా ఇంటి వాకిళ్ళగుమ్మాలు!!..
అక్షర ధనంతో అజ్ఞానాన్ని పారద్రోలుతాం!!..
సమాజంలోని తెలుగురాని
అట్టడుగు వర్గాలవారిఆకలి తీర్చే
ప్రయత్నం చేస్తాం!!….
తెలుగు రాక నిస్సత్తువతో
యాతనపడే వారికి
తెలుగు అమృత హస్తాన్ని అందిస్తాం!!…
తెలుగు అక్షరజ్ఞానం తెలియక దిగజారిన
జనం మధ్యలో అక్షరరాశులు పోస్తాం…
ఎన్నెన్నో అక్షరాలను వెతికి తెచ్చి…
ఓ సామాజిక స్ఫూర్తిని నింపి…
మానవీయబాటకు బాసటగా నిలుస్తాం.
సమానత్వ సాధనకు
తెలుగు సంకల్పబలంతో
ముందుకు నడిపిస్తాం!!….
స్వార్థమంటే ఎరుగని తెలుగు ధనం మాది…
త్యాగమై చరిత్రలో నిలిచేది!!…
బుద్ధి బలానిచ్చే భూమిలో పుట్టి..
తెలుగు ఆకృతితో తెలుగు జాగృతపర్చి..
ఆవేశంతో కాక ఆలోచనతో
భావాలకు పెద్దపీఠ వేసేది!!…
సత్వర నిర్ణయం తీసుకుంటాం!!…
సదా తెలుగు కొత్తదనంతో
ముందుకు సాగుతాం!!…
అక్షర ఆనవాలే లేనిచోట
తెలుగు ధనరూపంగా…
అక్షరాలను అందిస్తాం!!…
ఆస్తులున్నా..అంతస్తులెన్నున్నా
తెలుగు అక్షరధనమే అందరికీ
మూలధనం అని నిరూపిస్తాం!!…
అందరితో అక్షర స్నేహంగా చేరువవుతాం!!..
ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా అల్లుకుపోతాం!!…
ఈ అవనిలో తెలుగుతో
అధికులమై మొలకెత్తుతాం!!….
అక్షర ధనరాశులమై సమాజమంతా
విస్తారంగా పండుతాం!!…
తెలుగు వెలుగై
తెలుగు విలువలతో ప్రజ్వరిల్లుతాం!!…
అంతులేని ఆనందంతో
ఆనందతాండవం చేస్తాం!!…
మా తెలుగు ధనం తరతరాలుగా
ఓశాశ్వతమైన దనరాశి!!…
ఎవరూ దొంగిలించేది కాదు..
దోచుకునేది కూడా కాదు!!…
ఆ తెలుగుఅందరి మన్ననలనూ
అందుకుంటుంది!!…
తెలుగు కొందరితో చిరకాలపు
ప్రేమమాభిమానాలను
పొందుతుంది!!…
తెలుగు జాతి భవితను నిలబెట్టే
అసలైన తెలుగు ధనమిది!!…
జనం బతుకును సరిచేసే తెలివి తెలుగు
తెలుగు ఆత్మవిశ్వాసపు బలమిది!!…
నిత్యం వెలిగించే రత్నదీపాల వెలుగిది!!…
తెలుగు మా ఆత్మబలం ….
తెలుగు మా చైతన్య దళం…
తెలుగు మాఊపిరి తెలుగు మా ఊతం!!…
“ఈ రోజు మాతృభాష దినోత్సవ సందర్బంగా అందరికి శుభాకాంక్షలు” మన అమ్మ భాషను మరువొద్దు.
వర్థమాన కవియిత్రి ‘శ్రీ’ పంపిన ఈ కవితని మాతృ భాషా దినోత్సవ సందర్భంగా ఈ రోజు ప్రచురిస్తున్నాం.













