ఆంధ్ర నుంచి వచ్చేవారికీ ఈ-పాస్ తప్పనిసరి
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ఆంక్షలను విధించింది. ఇప్పటి వరకు వెసులుబాటు ఉన్న ఆంధప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రజలు కూడా తప్పనిసరిగా ఈ-పాస్ పొందాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో క్లబ్‌లు, బార్లు, సినిమా థియేటర్లు, వ్యాయామశాలలు, రిక్రియేషన్ క్లబ్‌లు, వాణిజ్య ప్రాంగణాలు, మాల్స్‌ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. బాడుగు, ట్యాక్సీల్లో డ్రైవర్లు మినహా ముగ్గురు, ఆటోల్లో డ్రైవరు మినహా ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని చెప్పింది. సోమవారం తెల్లవారుజామున (26వ తేదీ) 4 గంటల నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.













