సుప్రీంకోర్టులో ఎంపీ నవనీత్ కౌర్ కు భారీ ఊరట
మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. క్యాస్ట్ సర్టిఫికెట్ పై నవనీత్ కౌర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నవీన్ కౌర్ ఎస్సీ కాదంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. నవనీత్ 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. శివసేన అభ్యర్థి ఆనందరావుపై విజయం సాధించారు. అయితే, ఆమె నకిలీ పత్రాలతో ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం పొందారని శివసేన మాజీ ఎంపీ ఆనందరావు ఆరోపించారు. ఈ మేరకు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు నవనీత్ కౌర్ ధ్రువీకరణ పత్రం అబద్ధమని గుర్తించింది. ఈ మేరకు ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయడంతో పాటు రూ. 2 లక్షల జరిమానా విధించింది.













