న్యాయవ్యవస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులదే
ఉద్దేశపూర్వక దాడుల నుంచి న్యాయవ్యవస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులదే అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ న్యాయవ్యవస్థను పరిరక్షించడంలో న్యాయమూర్తులకు న్యాయవాదులు సహకరించాలని కోరారు. న్యాయవ్యవస్థ అనే కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు సభ్యులని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే రాజ్యాంగ మూలసూత్రమని, న్యాయవాద వృతి చాలా పవిత్రమైనదని గుర్తు చేశారు. నిజం వైపు నిర్బయంగా నిలబడటం సహా తప్పుడు అంతే స్థాయిలో ఖండిరచాలన్నారు. రాజ్యాంగ మూల సూత్రాలు అర్థం చేసుకొని ముందుకు వెళ్లేలా ప్రతిజ్ఞ చేద్దామని అన్నారు. ఎందరో న్యాయవాదులు దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని, రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం అంటే వారికి నివాళి అర్పించినట్లే అని అన్నారు.













