10 నుంచి సుప్రీంకు వేసవి సెలవులు

సుప్రీంకోర్టు వేసవి సెలవులు 4 రోజులు ముందుగానే ప్రారంభం కానున్నాయి. సాధారణంగా మే 14 నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రకటిస్తారు. ఈసారి మాత్రం మే 10 నుంచి సెలువులు మొదలవుతాయని సుప్రీంకోర్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో న్యాయవాద సంఘాల విజ్ఞప్తి నేపథ్యంలో వేసవి సెలవుల్లో మార్పు చేస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‍వి రమణ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 27న సుప్రీంకోర్టు పున ప్రారంభమవుతుందని తెలిపింది. ముందుగా ఖారారు చేసిన కోర్టు క్యాలెండర్ ప్రకారం వేసవి సెలవులు మే 14 నుంచి జూన్ 30 వరకు ఉండాలి.