100 ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మిస్తాం : సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏ

భారత్‍లో 100 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను నిర్మిస్తామని ఇండియన్ అమెరికన్ స్వచ్ఛంద సంస్థ సేవా ఇంటర్నేషనల్ యూఎస్‍ఏ ప్రకటించింది. తొలి 15 ప్లాంట్లను రానున్న 3 నెలల్లో ఏర్పాటు చేస్తామని తెలిపింది. కరోనాపై పోరాటంలో భారత్‍కు అండగా నిలిచి ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే తమ లక్ష్యమని పేర్కొంది. దీనికి ఆ సంస్థ రికార్డు స్థాయిలో 20 మిలియన్ డాలర్లు (రూ.145 కోట్లకు పైగా) విరాళాలు సేకరించింది. గత ఏడాది అమెరికాలో కరోనా ఉద్ధ•తంగా ఉన్నప్పుడు కూడా ఆ సంస్థ సేవలందించింది.