సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ముస్లింలు అతి పవిత్రంగా భావించే హజ్ యాత్రపై కూడా కరోనా పంజా విసిరింది. ప్రతీ ఏటా బక్రీద్ పండగకు నెల రోజుల ముందుగానే ప్రపంచ నలుమూలలకు చెందిన వేలాది ప్రజలు మక్కా యాత్రకు బయల్దేరతారు. లక్షలాది ప్రజలు పాల్గొనే ఆ పవిత్ర యాత్రపై కూడా కరోనా ప్రభావం పడింది. కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సారి అత్యంత సాదా సీదాగా హజ్ యాత్రకు జరపాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి హజ్‌కు కేవలం 1000 మందిని మాత్రమే అనుమతించనున్నట్లు ప్రకటించింది. జులై 29న ఈ యాత్రం ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. అయితే హజ్ యాత్రలో పాల్గొనే ఈ వెయిమంది కూడా కేవలం సౌదీలో నివసిస్తున్న వారు మాత్రమే. అక్కడ ఉన్న వారికే ఈ సారి హజ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతించనున్నారు. వీరిలో 30 శాతం మంది సౌదీ దేశస్తులు కాగా, మరో 70 శాతం మంది సౌదీలో నివసిస్తున్న విదేశీయులు ఉండనున్నట్లు సౌదీ హజ్ మంత్రిత్వశాఖ వెల్లడించింది.













