కరోనా టెస్టు చేయించుకున్న ఉపరాష్ట్రపతి
ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో 72 గంటల ముందు ఎంపీలు అంతా కరోనా టెస్టు చేసుకోవాలని వెంకయ్య నాయుడు సూచించారు. పార్లమెంట్లో సమావేశాల్లో ఎంపీలకు కరోనా నెగటివ్ రిపోర్టు తప్పనిసరి అన్నారు. ప్రభుత్వం ఆమోదించిన ఆసుపత్రులు, లాబోరేటరీలు, పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన టెస్ట్ సెంటర్లో పరీక్షలు చేయించుకుని రిపోర్టు సమర్పించాలన్నారు. పార్లమెంట్ అధికారులు, సిబ్బంది కరోనా పరీక్షలు చేసుకోవాలని కూడా ఆయన సూచించారు. డీఆర్డీవో ద్వారా ఎంపీలకు కరోనా ప్రత్యేక కిట్లు అందిస్తున్నట్లు తెలిపారు. కాగా ఎలక్ట్రానిక్ మోడ్‌లో పార్లమెంట్ బిజినెస్ పేపర్లు ఉండనున్నాయని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.













