రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక నిర్ణయం… వాటిపై నిషేధం
త్రివిధ దళాల్లో స్వదేశీ సాధన సంపత్తికి పెద్దపీట వేసే దిశగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ బలగాలకు సంబంధించిన 780 ఉపకరణాలు, ఉప వ్యవస్థల దిగుమతిని నిషేధించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దేశీయంగానే వీటిని ఉత్పత్తి చేయాలి. ఆరేళ్ల కాలావధిలో దశలవారీగా ఈ నిర్ణయం అమలవుతుంది. దిగుమతుల నిషేధంపై రక్షణ శాఖ ఇలాంటి జాబితాను విడుదల చేయడం ఇది మూడోసారి. వాటిలో పేర్కొన్న సాధన సంపత్తిని దేశీయంగానే అభివృద్ధి చేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించడంతో పాటు రక్షణ విభాగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ (డీపీఎస్యూ)లు దిగుమతులపై ఆధారపడటం తగ్గిపోతుందని అధికారులు తెలిపారు.













