ఈడీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మూడు గంటలపాటు ప్రశ్నించింది. నేషనల్ హెరాల్డ్ కేసుపై దర్యాప్తులో భాగంగా ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. దీంతో రాహుల్ గాంధీ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ అధికారులు ఆయనను సుమారు మూడు గంటల పాటు ప్రశ్నించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ యంగ్ ఇండియా లిమిటెడ్‌తో రాహుల్‌కు సంబంధాలు, ఆయన పేరుపై ఉన్న షేర్ల వివరాలు, గత షేర్ హోల్డర్లతో సంబంధాలు, సమావేశాలు, యంగ్ ఇండియాకు కాంగ్రెస్ రుణాలు, నేషనల్ హెరాల్డ్ పునరుద్ధరణపై కాంగ్రెస్ నిర్ణయం, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, నేషనల్ హెరాల్డ్ ఆస్తులు, నిధుల బదిలీల వివరాలను ఈడీ అడిగినట్లు సమాచారం. కాగా మూడు గంటల ఈడీ విచారణ తర్వాత రాహుల్ గాంధీ ఆ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అనంతరం కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.













