ఆప్ ప్రభుత్వం శుభవార్త… జులై 1 నుంచి
పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్తనందించింది. జులై 1 నుంచి ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు కరెంట్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారీ ప్రకటన చేసింది. ఈ నెల 16న పంజాబ్ ప్రజలకు శుభవార్త అందించనున్నట్లు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇటీవల ప్రకటించారు. కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆప్ ఇచ్చిన హామీల్లో ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు కూడా ఒకటి. అధికారంలోకి వచ్చిన నెలలోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది ఆప్ సర్కార్. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్ ఇస్తోంది.













