ప్రధాని మోడీ 25 ఏళ్ల అధికార ప్రస్థానం…!
భారతీయ రాజకీయ చదరంగంలో సూపర్ హీరో ప్రధాని మోడీ.. వరుసగా 25 ఏళ్లుగా అధికారం ఆయనను అంటిపెట్టుకునే ఉంది. సాదారణంగా ఓదఫా గెలిచిన వారు.. రెండోసారి ప్రజా వ్యతిరేకతతో ఓడిపోతుంటారు. దీనికి అతిరథ మహారధులు సైతం అాతీతులేమీ కాదు.. కానీ వీటన్నింటినీ పక్కన పడేసి.. నరేంద్రమోడీ నాన్ స్టాప్ విజయాలు అందుకుంటూ వస్తున్నారు. ప్రజాసేవలో సుదీర్ఘ కాలంపాటు ప్రయాణిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 ఏళ్ల అధికార ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నరేంద్రమోడీ.. బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. దేశీయంగా, అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతోన్న తరుణంలో ‘మనం చేయగలం’ అనే కొత్త నినాదాన్ని ఇచ్చారు (Prime Minister Narendra Modi). ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప్ సభలో ఈ మేరకు మాట్లాడారు. అలాగే తన భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచించలేదని వ్యాఖ్యానించారు.
‘‘ప్రజల ఆశీర్వాద బలమే నన్ను ఇంతకాలం నడిపించింది. గుజరాత్ సీఎంగా ప్రమాణం చేసినప్పుడు ఇంతగా ఆలోచించలేదు. 25 ఏళ్లుగా నిరంతర ప్రజాసేవ అందిస్తానని నాడు ఊహించలేదు. ఆశీస్సులు అందించిన దేశ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నన్ను ఇంతగా ఆదరిస్తోన్న ప్రజలను ఎన్నటికీ మర్చిపోలేను. ప్రజాసేవ చేసేందుకు నాకు భగవంతుడు శక్తినిచ్చాడు. ప్రజలు, భగవంతుడి ఆశీస్సులతో దేశానికి మరింత సేవ చేస్తా. ప్రజా సేవలో ఏనాడూ వెనుదిరగనన్నారు.
ప్రజలే నా దృష్టిలో దేవుడి స్వరూపం. వారు నాపై ఎంతో విశ్వాసం ఉంచారు.. దానిని ఎప్పటికీ వమ్ము చేయను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది మద్దతుగా నిలిచారు. ప్రజా సేవలో ఉన్నప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయి. వాటిని పట్టించుకుంటే.. ముందుకు వెళ్లలేం. వ్యక్తిగతంగా నన్ను విమర్శిస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తాను. నన్ను రాజకీయంగా బలోపేతం చేసేది నా ప్రత్యర్థులే. వారు ఎంతగా విమర్శిస్తే.. నేను అంతగా ఆలోచిస్తాను. నేను నిరంతర విద్యార్థిని’’ అని మోడీ(Narendra Modi) మాట్లాడారు.
ఇవి కూడా చదవండి
వికసిత్ భారత్ గురించి మోడీ (PM Modi) ప్రస్తావించారు. ‘‘2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధించి తీరుతాం. ఆత్మనిర్భర్ భారత్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సాధ్యమే. అంతరిక్షంలో అడుగుపెట్టడం, ఒలింపిక్స్ నిర్వహణ.. ఇలాంటివన్నీ సాధ్యమే. ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. దేశాభివృద్ధికి ఇదే మంచి సమయం. నూతన చరిత్ర లిఖించే సమయం ఆసన్నమైంది. అన్ని రంగాల్లో నూతన ఆవిష్కరణలకు ఇదే సమయం. సమస్యలు ఉంటే.. పరిష్కారం కూడా దాని వెంటే ఉంటుంది. సంకల్ప బలం ఉంటే దేనినైనా సాధించవచ్చు. 25 ఏళ్లు అంటే ఒక విజయంగానే కాదు.. సేవగానూ భావిస్తాను. ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు ఎప్పటికీ అలసిపోను.
భారత్ అభివృద్ధే నా జీవిత ఆశయం. దేశ అభివృద్ధి కోసం.. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటా. అడవుల్లో గిరిజన సమాజాలకు సేవ చేయడంలో నా సమయాన్ని గడిపా. నా భవిష్యత్తు ఏమిటో కూడా నేనెప్పుడూ ఆలోచించలేదు’’ అని వ్యాఖ్యలు చేశారు.
‘‘ఇప్పుడు ప్రపంచమంతా మన దేశ పైలట్ స్మిత్ మచ్చర్పైనే చర్చ జరుగుతోంది. భారతీయ పైలట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒక రోజు భారత్‌లో తయారైన విమానం గురించి భారత్ మాట్లాడుతుంది. దేశ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలియజెప్పే సమయం ఎంతో దూరంలో లేదు. దేశం అభివృద్ధి దిశలో పరుగులు పెడుతోంది. దానిని ఎవరూ ఆపలేరు. ఒకప్పుడు ఉగ్రవాదం పెనుముప్పుగా పరిణమించింది. ప్రజలు ఆందోళనతో జీవనం సాగించారు. గత ప్రభుత్వాలు ఉగ్రవాదంపై మెతకవైఖరి ప్రదర్శించాయి. దేశ భద్రతకు ముప్పు వస్తే.. ప్రతిఘటన ఎలా ఉంటుందో మేం చూపించాం’’ అని దేశ సైనిక సామర్థ్యాలను కొనియాడారు.








