బిమ్స్ టెక్ సదస్సులో ప్రధాని మోదీ.. సంచలన వ్యాఖ్యలు
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ చట్టాలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక అధ్యక్షతన నిర్వహించిన బిమ్స్ టెక్ సదస్సులో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో యూరప్‌లో జరుగుతున్న కొన్ని సంఘటనలు అంతర్జాతీయ చట్టాల స్థిరత్వం, పరిధిని ప్రశ్నిస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ బంధాలు బలపడాల్సిన అవసరం ఉందనిన అన్నారు. 1997లో కలిసి లక్ష్యాలను అధిగమించినట్టే ఇప్పుడు బిమ్స్ టెక్ దేశాలూ కలిసి ముందుకు సాగాలన్నారు. ప్రాంతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అనుసంధానత, సౌభాగ్యత, భద్రతను పెంపొందించుకోవాల్సి ఉందన్నారు. బిమ్స్ టెక్ గ్రూప్ నిర్మాణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఓ చార్టర్‌ను తీసుకొస్తున్నామని తెలిపారు. నలంద అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అందిస్తున్న బిమ్స్ టెక్ స్కాలర్ సిఫ్ను పొడిగిస్తున్నామని తెలిపారు. బిమ్స్ టెక్ నిర్వహణ ఖర్చులకు గాను 10 లక్షల డాలర్లను ఇస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.













