మెట్రో రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ కాన్పూర్ పర్యటనలో భాగంగా మెట్రో రైలులో ప్రయాణించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురితో కలిసి ఆయన ప్రయాణం సాగించారు. ఐఐటీ-కాన్పూర్ నుంచి మోతీ జీల్ వరకు సుమారు తొమ్మిది కిలోమీటర్ల పొడవైన రైల్ ప్రాజెక్టు ఇది. మొత్తం 32 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టును 11,000 కోట్లతో పూర్తి చేసినట్టు తెలిసింది. మోదీ ప్రధానంగా దృష్టి సారిస్తున్న అంశాల్లో అర్బన్ మెబిలిటీ ఒకటని, ఆ దిశగా కాన్పూర్ రైల్ ప్రాజెక్ట్ మరో ముందడుగని తెలిపింది. దీనికి ముందు కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కంఫ్లీటెడ్ సెక్షన్, బినా`పంకీ మల్టీ ప్రొడక్ట్ పైప్లైన్ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.













