బీహార్ లో ఎన్డీఎ గెలుస్తుంది…మోదీ
బీహార్ ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ ఎన్డిఎకు విజయం తెచ్చిపెట్టడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అరరియా జిల్లాలోని ఫోర్బస్గంజ్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఇది కేవలం దేశానికి మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి సందేశం అన్నారు. కోవిడ్ వేళ ప్రజలు భారీ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న శక్తి అని, ప్రతి బీహారీ ప్రజాస్వామ్యం పట్ల అంకితభావంతో ఉన్నట్లు మోదీ తెలిపారు. ప్రజాస్వామ్య పండగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికల సంఘం అదనపు ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహించడం గొప్ప విషయమని, ఈసీకి కంగ్రాట్స్ చెబుతున్నానని, గత దశాబ్ద కాలంలో బీహార్లో ప్రతి ఇంటికి విద్యుత్తు, గ్యాస్ కనెక్షన్లు అందాయని, 2021 నుంచి 2030 వరకు మరిన్నిఅవసరాలను తీర్చనున్నట్లు ప్రధాని చెప్పారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ పట్ల ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నట్లు ఆయన అన్నారు.













