26న ఐరాసలో మోదీ ప్రసంగం
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రధాని మోదీ ఈ నెల 26న ప్రసంగించనున్నారు. అయితే ఈసారి ప్రత్యక్షంగా కాకుండా ఆన్లైన్ ద్వారా జనరల్ అసెంబ్లీ సెషన్స్ జరపనున్నారు. ప్రపంచనేతలు ఈ సెషన్ కోసం ముందస్తుగా రికార్డు చేసిన వీడియోలు పంపనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 75వ జనరల్ అసెంబ్లీ సెషన్లో మాట్లాడే వక్తల జాబితాను ఐరాస ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం మోదీ ప్రసంగం 26న ఉంటుంది. అయితే ఈ జాబితా తుది జాబితా కాదని, మరికొన్ని వారాల్లో తుదిజాబితా వస్తుందని తెలిపింది. ఈ నెల 22-29 మధ్య జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి.













