రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత
కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) వ్యవస్థాపక అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్ (74) గురువారం ఢిల్లీలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయనకు ఇటీవలే గుండె సంబంధిత శస్త్రచికిత్స జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యం విషమించి ఆయన తుదిశ్వాస విడిచారు. పాశ్వాన్ మరణవార్తను ఆయన కుమారుడు, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ సోషల్‌మీడియాలో వెల్లడించారు. దేశ రాజకీయాలపై బలమైన ముద్రవేసిన దళిత నేతల్లో పాశ్వన్ ఒకరు. వెనుకబడిన వర్గాలకు విధ్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పించాలన్న మండల్ కమిషన్ సిఫారసులను 1990 దశకంలో అమల్లోకి తేవటంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.
రామ్‌విలాస్ పాశ్వన్ బీహార్‌లోని ఖగారియా జిల్లా శహర్బన్ని గ్రామంలో 1946 జులై 5న నిరుపేద దళిత కుటుంబలో జమున్ పాశ్వన్, సియాదేవి దంతపులకు జన్మించారు. 1969లో సోషలిస్టు పార్టీ తరపున మొదటిసారి బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977 పార్లమెంట్ ఎన్నికల్లో జనతాపార్టీ తరపు హాజీపూర్ నుంచి రికార్డు మెజార్టీతో గెలుపొందారు. 1980, 89, 96,98, 99, 2004, 2014లో వరుసగా హాజీపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2000లో జనతాదళ్ నుంచి బటయకు వచ్చిన ఎల్జేపీని నెలకొల్పారు. ఆయన ఐదుగురు ప్రధానులతో కలిసి కేంద్రమంత్రిగా పనిచేసిన అరుదైన ఘనత సాధించారు. 1996 నుంచి 2015 వరకు కేంద్రంలో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ, యూపీఏ కూటమల్లో భాగస్వామి అయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.













