దక్షిణాసియా దేశాల్లోనే భారత్ కు ప్రథమ స్థానం
ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ (ఈ సెక్యూరిటీ) విషయంలో దక్షిణాసియా దేశాల్లోనే భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 110 దేశాలో జాబితాలో 59వ స్థానం దక్కించుకుంది. చైనాతో పోలిస్తే భారత్ ముందంజలో ఉండటం విశేషం. ఎలక్ట్రానిక్ భద్రత, మౌలిక వసతులు, ఇంటర్నెట్ నాణ్యత వంటి అంశాలపై బ్రిటన్కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ సర్ఫ్ షార్క్ ఈ సర్వే చేసింది. జాబితాలో డెన్మార్క్ వరుసగా రెండోసారి ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, అమెరికా ఐదో స్థానంలో నిలిచింది. దిగువన ఇథియోపియా, కంబోడియా, కామెరూన్ గ్యాటెమాల, అంగోలా ఉన్నాయి.













