ప్రపంచంలోనే తొలిసారిగా అన్ని జాతుల జీవుల జాబితాను ఆవిష్కరించిన ఇండియా

దేశంలోని అన్ని జాతుల జీవుల జాబితాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇలా 1,04,561 జాతుల జీవాల జాబితాను రూపొందించిన తొలి దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. జీవవైవిధ్యాన్ని డాక్యుమెంట్ రూపంలోకి తెచ్చిన ఘనత భారత్‌కే దక్కిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. కోల్‌కతాలో జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 109వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఫౌనా ఆఫ్ ఇండియా చెక్‌లిస్ట్ పోర్టల్ ను మంత్రి ఆవిష్కరించారు. డాక్యుమెంట్‌లో 36 జంతుల కుటుంబాలకు చెందిన 121 జీవ వర్గాలను విభజించి వాటి సంఖ్యను లెక్కగట్టారు. స్థానిక జాతులు, పరిరక్షించాల్సిన జంతువుల వివరాలు, అంతరించిపోతున్న జాతులకు డాక్యుమెంట్‌లో చోటు కల్పించారు.