ఇలాంటి వివాహం దేశంలో ఇదే తొలిసారి!
ఒక అమ్మామి అబ్బాయిని పెళ్లాడడం సాధారణం. స్వలింగ వివాహాలు ఇటీవల ట్రెండ్. తనను తానే పెళ్లి చేసుకోవడం మనదేశంలో సరికొత్త ట్రెండ్. గుజరాత్లోని వడోదరకు చెందిన క్షమా బిందు (24) అనే మహిళ తనను తానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించింది. జూన్ 11న ముహూర్తం కూడా పెట్టించుకుంది. గోవాలో సింగిల్ గా 2 వారాలపాటు హనీమూన్ జరుపుకోవడానికి ఏర్పాట్లు కేడా చేసుకుంది. ఇలాంటి వివాహం దేశంలో ఇదే తొలిసారి కావొచ్చని క్షమ పేర్కొంది. నేనెప్పుడూ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కానీ పెళ్లి కూతురు కావాలనే కోరిక ఉంది. అందుకే నన్ను నేనే పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పింది. తన నిర్ణయాన్ని తల్లిదండ్రులు అమోదించారని పేర్కొంది. తమను తామే వివాహం చేసుకోవడాన్ని సోలోగమీ అంటారు. 2003లో పాపులర్ టీవీ సిరీస్ సెక్స్ అండ్ సిటలో క్యారీ బ్రాడ్ షా అనే క్యారెక్టర్ ద్వారా ఈ కాన్సెప్ట్ పాపులర్ అయింది. 2017లో బ్రెజిల్ మోడల్ అడ్రియానా లిమా తనను తానే పెళ్లి చేసుకుంది.













