BIOPACKATHON 2026: ఐడియా మీది.. 10 లక్షల రూపాయలు మావి… అదిరిపోయే ఆఫర్ మీకోసం
BIOPACKATHON 2026: పెరిగిపోతున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణానికి హాని కలిగించని, భూమిలో త్వరగా కలిసిపోయే (Biodegradable) ప్యాకేజింగ్ ఐడియాలను ఆహ్వానిస్తూ *‘BIOPACKATHON 2026’ ను నిర్వహిస్తోంది. కొత్త ఆలోచనలు ఉన్న యువత, స్టార్టప్‌లు , పరిశోధకులను ప్రోత్సహించడమే ఈ పోటీ ప్రధాన ఉద్దేశ్యం.
భారీ నగదు బహుమతులు:
ఈ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు కేంద్ర ప్రభుత్వం భారీ నగదు పురస్కారాలను ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
- మొదటి బహుమతి: రూ. 10 లక్షలు
- రెండవ బహుమతి: రూ. 7 లక్షలు
- మూడవ బహుమతి: రూ. 5 లక్షలు
అదనపు ప్రయోజనాలు:
కేవలం నగదు బహుమతులే కాకుండా, విజేతలకు తమ ఐడియాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసేందుకు ప్రముఖ పరిశ్రమలతో కలిసి పనిచేసే అరుదైన అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ నిపుణుల పర్యవేక్షణలో తమ ప్రాజెక్టులను మరింత మెరుగుపరుచుకోవచ్చు.
దరఖాస్తు వివరాలు:
పర్యావరణ హితమైన ప్యాకేజింగ్ రంగంలో వినూత్న ఆలోచనలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 24, 2026 లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి








