రాహుల్ గాంధీకి ఈడీ మరోసారి నోటీసులు
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13న విచారణకు హాజరవాలని ఆదేశించింది. కాగా ఈ నెల 1న అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాహుల్, జూన్ 8న సోనియా ఢిల్లీ లో ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని అందులో పేర్కొంది. అయితే ప్రస్తుతం తాను విదేశీ పర్యటనలో ఉన్నానని, జూన్ 5 తర్వాత విచారణకు హాజరవుతానని రాహుల్ ఈడీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో విచారణ తేదీని ఈ నెల 13కి మార్చింది. కాగా షెడ్యూల్ ప్రకారమే ఈడీ ప్రశ్నలకు ఎదుర్కొంటానని సోనియా గాంధీ ప్రకటించినప్పటికీ ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది.













