గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ ఇక లేరు
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్ (92) గురువారం కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్నా, తదనంతరం ఆయన పరిస్థితి విషమించి గుండెపోటుతో మరణించారు. గుజరాత్లో బీజేపీని బలోపేతం చేయడంలో కేశూభాయ్ కీలకపాత్ర పోషించారు. 1995, 1998-2001 మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రధాని మోదీతో పాటు పలువురు యువనేతలకు గురువుగా వ్యవహరించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజు సంతాపదినం ప్రకటించింది. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని గుజరాత్ ముఖ్యమత్రి విజయ్ రూపానీ తెలిపారు.













