సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టుకు ఇటీవల నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వీరితో ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు చరిత్రలో 9 మంది ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. ఈ అపూర్వ వేడుకకు సుప్రీంకోర్టు అదనపు భవన ఆవరణంలోని ఆడిటోరియం వేదికయింది. న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సి.టి. రవికుమార్, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ బేలా మాధుర్య త్రివేది, జిస్టస్ పమిడిగంధం శ్రీనరసింహలు ప్రమాణం చేశారు. ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. ఈ తొమ్మిది మందితో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 33కు చేరింది.













