కరోనా చర్యల విషయంలో ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు గరంగరం…
కరోనా విజృంభణతో ఢిల్లీ అల్లాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని క్రేజీవాల్ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజురోజుకీ కేసులు పెరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని, కరోనా కారణంగా ఎంతోమంది ప్రాణాలు వదిలారని, వీరి కుటుంబాలకు మీరు చెప్పే సమాధానం ఏమిటని ఢిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా టెస్టులను పెంచేలా చూడాలని కోరుతూ న్యాయవాది రాకేశ్ మల్హోత్రా దాఖలు చేసిన పిటిషన్ ఫై ఢిల్లీ హైకోర్డు విచారణ జరిపినప్పుడు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా కొవిడ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.













