ఢిల్లీ ప్రజలకు శుభవార్త ..మరో ఆరు నెలలు పొడిగింపు
ఢిల్లీ ప్రజలకు ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2022 మే వరకూ ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది. సామాన్య ప్రజానీకం కనీసం రెండు పూటలా తిండికి నోచుకోని పరిస్థితి. కోవిడ్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రధాని గారు పేద ప్రజలకు ఉచిత రేషన్ సరఫరా పథకాన్ని మరో ఆరు నెలలు పొడిగించండి. ఢిల్లీ ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని రాబోయే ఆరు నెలలు పొడిగించింది అని కేజ్రీవాల్ తెలిపారు.













