చార్ధామ్ యాత్ర… ఈసారి వారికి మాత్రమే అవకాశం
చార్ధామ్ యాత్రకు అనుమతిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1న ఈ యాత్ర మొదలవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కాకపోతే, ఈసారి ఉత్తరాఖండ్ వాసులకు మాత్రమే అవకాశం కల్పించింది. వారిలో కూడా కార్వంటైన్‌లో ఉన్నవారికి, కట్టడి ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అనుమతించబోమని చెప్పింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల వారిని ఈసారి యాత్రకు అనుమతించలేకపోతున్నట్లు తెలిపింది. యాత్రికులకు సృష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. దర్శనం కోసం యాత్రికులు ముందుగానే ఈ పాస్‌లు పొందాలని సూచించింది. కరోనా లక్షణాలున్నవారు ఈ పాస్‌లకు దరఖాస్తు చేయవద్దని కోరింది. దేవస్థానం జారీచేసిన ఈ పాస్‌లు కేవలం 2 రోజులు మాత్రమే చెల్లుబాటవుతాయని సృష్టం చేసింది.













