రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎందుకు బహిష్కరించామంటే…
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం అంటే ఆయన్ను అవమానించడం కాదు అని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ తెలిపారు. లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన అధిర్ మీడియాతో మాట్లాడారు. రైతులకు మద్దతు ఇస్తున్నామని, కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడానికి ఇదే అతిపెద్ద కారణమని అన్నారు. అయితే రైతు సాగు చట్టాల అంశంపై చర్చ పెట్టినప్పుడు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. సాగు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు అనుకూలంగా నినాదాలు చేశారు. సెంట్రల్ హాల్లోకి తమల్ని అనుమతించలేదని, అందుకే తాము గేటు వద్ద నినాదాలు చేసినట్లు సింగ్ తెలిపారు. రైతులను దేశద్రోహులు అంటూ ఆరోపిస్తున్నారని, అందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించినట్లు చెప్పారు.













