2024 తీర్పు ఇప్పుడు కాదు.. అప్పుడే
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటిలో బీజేపీ విజయం సాధించగా 2024 ఫలితాన్ని 2022లోనే ప్రజలు వెలువరించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ తప్పుపట్టారు. రాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం మోదీ ఢిల్లీలోని బీజేపీ విజయోత్సవ సభలో మాట్లాడుతూ 2024 తీర్పును ప్రజలు ఇప్పుడే ఇచ్చారంటూ మోదీ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం పోరాడాల్సిందేనని, ఫలితాలు కూడా అప్పుడే నిర్ణయించబడతాయని, రాష్ట్రాల ఫలితాలను బట్టి కాదని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోరాడాల్సిందే తీర్పు అప్పుడే నిర్ణయించబడుతుంది. రాష్ట్ర ఎన్నికల బట్టి అప్పటి ఫలితాలు సైకాలజీకల్ అడ్వాంటేజ్ చేసేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువటి కథనాలకు పడిపోకండి అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.













