అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన… గుజరాత్ లో

ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ఆయన గుజరాత్‍లో పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‍లో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ 2022లో గుజరాత్‍లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. తమ పార్టీ అభ్యర్థులు అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీకి నిలబడతారని పేర్కొన్నారు. ఈ ఏడాది సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆప్ 120 స్థానాల్లో పోటీ 27 సీట్లలో విజయం సాధించింది. ఆ ఎన్నికల అనంతరం కేజ్రీవాల్ రెండోసారి గుజరాత్‍లో పర్యటించారు. ఇక కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ గుజరాత్‍లోని స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీ నిలిపిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి జాతీయ పార్టీగా ఆవిర్భవించింది.