ఆప్ సిఎం అభ్యర్థి … పోటీ అక్కడి నుంచే
వచ్చే నెలలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాస్ గఢ్వీ పోటీ చేయబోయే స్థానాన్ని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గఢ్వీ సొంత జిల్లా దేవ్‌భూమి ద్వారకాలోని ఖంభాలియా నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటారని వెల్లడించారు. ఇసుదాస్ గఢ్వీ కొన్నేళ్లుగా రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు, వ్యాపారుల తరపున గళం వినిపిస్తున్నారని తెలిపారు. శ్రీకృష్ణుడి పవిత్రస్థలం నుంచి గుజరాత్‌కు కొత్త, మంచి ముఖ్యమంత్రి రాబోతున్నారంటూ పేర్కొన్నారు. దీనిపై స్పదిస్తూ గఢ్వీ మీరు, గుజరాత్ ప్రజలు నాపట్ల ఉంచిన విశ్వాసం మేరకు నా తుదిశ్వాస వరకు గుజరాత్ ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇస్తున్నా అని పేర్కొన్నారు.













