ఆమ్ ఆద్మీ రాజ్యసభ సభ్యులు వీరే
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా రాజ్యసభలోనూ తమ సంఖ్యను పెంచుకునేందుకు సిద్ధమైంది. పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఐదుగురు రాజ్యసభ సభ్యుల్ని నామినేట్ చేసింది. అయితే ఈనెల 31న పంజాబ్‌లోని ఏడు రాజ్యసభ స్థానాలకు అయిందింటిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ ఆ అయిదుగురి పేర్లను ప్రకటించింది. క్రికెటర్ హర్భజన్‌తో పాటు డాక్టర్ సందీప్ పాటక్, ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అశోక్ మిట్టాల్, కృష్ణ ప్రాణ్ బ్రెస్ట్ క్యాన్సర్ కేర్ ఛారిటెబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సంజీవ్ అరోరా పేర్లను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ఆప్ ప్రకటించింది. ప్రస్తుత మెజార్టీని బట్టి ఈ ఐదు స్థానాలు ఆప్కే దక్కనున్నాయి.
క్రికెటర్ హర్భజన్‌కు స్పోర్ట్స్ వర్సిటీ బాధ్యతలు కూడా అప్పగించేందుకు ఆప్ నిర్ణయించిన విషయం తెలిసిందే.ఐఐటీ ఢల్లీిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన పాఠక్ చాన్నాళ్ల నుంచి ఆ పార్టీ వ్యూహాకర్తగా కొనసాగుతున్నారు. కేంబ్రిడ్జ్ వర్సిటీలో పాఠక్ పీహెచ్డీ పూర్తి చేశారు. కేజ్రీవాల్ టీమ్‌లో పాఠక్ కీలక వ్యక్తిగా నిలిచారు. పంజాబ్‌లో 117 స్థానాలకు గానూ 92 సీట్లను ఆప్ గెలుచుకుంది.













