ఆంధప్రదేశ్, తెలంగాణ నుంచి ఢిల్లీకి వస్తే….

ఆంధప్రదేశ్, తెలంగాణ నుంచి ఢిల్లీకి వచ్చే వారు 14 రోజులపాటు తప్పనిసరిగా ఇన్‍స్టిట్యూషనల్ క్వారంటైన్‍లో ఉండాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు లేదా ప్రయాణినికి 72 గంటల ముందు చేసిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చిన వారు వారం పాటు హోంక్వారంటైన్‍లో ఉంటే సరిపోతుందని పేర్కొంది. ఆంధప్రదేశ్, తెలంగాణల్లో తీవ్రమైన కొవిడ్ స్ట్రెయిన్ ఉనికి నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ వివరించింది.