రష్యా ఫైటర్ ను తరిమికొట్టిన అమెరికా
అమెరికా భూభాగమైన అలస్కా సమీపంలోని రష్యా యుద్ద విమానాలు వచ్చాయి. గమనించిన అమెరికా ఎయిర్‌ఫోర్స్ తన ఫైటర్ జెట్స్‌ను రంగంలోకి దించింది. గాల్లోకి లేచిన అమెరికా ఫైటర్ జెట్లు రష్యా యుద్ధ విమానాలను అడ్డుకుని తరిమాయి. నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ ఈ విషయం తెలిపింది. ఈ నెల 13న ఈ సంఘటన జరిగిటనట్టు చెప్పింది. రష్యాకు చెందిన టీయూ-95 బేర్ హెచ్ బాంబర్లు, సుఖోయ 35 ఫైటర్ జెట్లు అలస్కా ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ సమీపంలోకి వచ్చాయని తెలిపింది. దీంతో గాల్లోకి లేచిన తమ యుద్ధ విమానాలు వాటిని అడ్డగించి దారి మళ్లించాయని పేర్కొంది.













