గడువు ముసిగింది.. మస్క్ తో ఒప్పందంపై ట్విటర్
ట్విటర్‌ను సుమారు రూ.3.41 లక్షల కోట్లకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేసేందుకు గాను కేటాయించిన వేచి చూసే గడువు ముగిసిందని ట్విటర్ ప్రకటించింది. హార్ట్-స్కాట్-రోడినో( హెచ్ఎస్ఆర్) యాంటీట్రస్టు ఇంఫ్రూవ్మెంట్స్ చట్టం (1976) ప్రకారం భారీ స్థాయిలో లావాదేవీలు జరిగే ఒప్పందాల విషయంలో ఇరు పక్షాలు అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌ను సమీక్ష కోసం సంప్రదించాల్సి ఉంటుంది. ఆ చట్టం ప్రకారం వేచి చూసే గడువు ముగిసిందని, ఇక ట్విట్టర్ వాటాదారులు, ఇతర నియంత్రణ సంస్థల ఆమోదాలపైనే ఒప్పందం పూర్తి కావడమేనది ఆధారపడి ఉందని ట్విటర్ పేర్కొంది.













