ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఎలాన్ మస్క్
ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక వర్క్ ఫ్రం హోం ఇక చాలు ఆపీసులకు రండి.. లేదంటే కంపెనీని వీడండి అంటూ తన ఉద్యోగులకు షాకిచ్చిన మస్క్ తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుత తరుణంలో ఆర్థిక వ్యవస్థపై సూపర్ బ్యాడ్ ఫీలింగ్ ఉందని, ఈ నేపథ్యంలో దాదాపు 10 శాతం సిబ్బందిని తగ్గించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఉద్యోగులకు అంతర్గత మెయిల్స్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్త నియామకాలన్నింటినీ నిలిపివేయండి అంటూ ఈ మెయిల్ పంపినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై టెస్లా ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.













