రష్యా విదేశాంగ మంత్రికి ఊహించని షాక్
రష్యా విదేశాంగ మంత్రి సెర్గె లవ్రోవ్‌కు ఊహించని షాక్ తగిలింది. రెండు రోజుల సెర్బియా పర్యటనకు బయలుదేరాల్సిన ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీనికి కారణం సెర్బియా పొరుగుదేశాలైన బల్గేరియా, నార్త్ మాసిడోనియా, మాంటెనెగ్రోలు తమ గగనతలాన్ని మూసివేయడమే. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో లవ్రోవ్ విమానం తమ భూభాగం గుండా ప్రయాణించేందుకు ఈ దేశాలు నిరాకరించాయి. దీంతో రెండు రోజుల పర్యటనను రద్దు చేసుకొన్న లవ్రోవ్ ..సెర్బియా విదేశాంగ మంత్రినే తమ దేశానికి ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.













