ఐఎస్ఎస్ కు రష్యా గుడ్ బై!
అంతర్జాతీయ రోదసీ స్టేషన్ (ఐఎస్ఎస్)ను 2024 తర్వాత విడిచి పెట్టాలని రష్యా నిర్ణయించింది. రష్యా రోదసి సంస్థకి కొత్తగా నియమితులైన చీఫ్ యూరీ బొరిసోప్ ఈ విషయాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి తెలిపారు. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యపై క్రెమ్లిన్‌కి, పశ్చిమ దేశాలకు మధ్య ఉద్రిక్తతలు చెలరేగడం, రష్యాపై కనివినీ ఎరుగని రీతిలో ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడిరది. అంతర్జాతీయ రోదసి కేంద్రం (ఐసిసి)లో అమెరికా, రష్యా కలిసి మెలిసి పని చేస్తున్నాయి. మా భాగస్వాములతో మేం చేయాల్సిన పనులన్నీ పూర్తి చేస్తాం. కానీ 2024 తర్వాత అంతర్జాతీయ స్టేషన్‌కు వీడి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్మామని యూరీ బోరిసోవ్ తెలిపారు.













