అగ్రరాజ్యంపై రష్యా ఆంక్షలు
ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాపై అగ్రరాజ్యం అమెరికా అనేక కఠిన ఆంక్షలకు దిగింది. ఇందులో వ్యక్తిగత ఆంక్షలూ ఉన్నాయి. ఈ చర్యలకు మాస్కో ప్రతి చర్యలు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఇతర ప్రభుత్వ అధికారులు పై వ్యక్తిగత ఆంక్షలు విధించింది. తద్వారా ప్రతీకారం తీర్చుకుంది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి బ్లింకెన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్క్ మిల్లీ తదితరులు ఉన్నారు.













