ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్దది.. 900 అడుగుల లోతులో
మెక్సికో సముద్రగర్భంలో 900 అడుగుల లోతైన భారీ బిలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బిలమని తెలిపారు. దీనిని మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పం తీరంలో చేటుమల్ బే లో కనుగొన్నారు. ఇది సుమారు 900 అడుగుల లోతు 1,47,000 అడుగుల విస్తీర్ణంలో ఉందని తెలిపారు. దీనికి టామ్ జా అని పేరు పెట్టారు. టామ్ జా అంటే మయన్ భాషలో లోతైన నీరు అని అర్థం. వాస్తవానికి ఈ భారీ బిలాన్ని 2021లో కనుగొన్నారు. దక్షిణ చైనా సముద్రంలో కనుగొన్న డ్రాగన్ బిలం ప్రపంచంలోనే అతిపెద్దది. దీని తర్వాతి స్థానం టామ్ జా ఆక్రమించింది. ఈ బిలాల్లో ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. సూర్య కిరణాలు ఉపరితలం వరకే ప్రసరిస్తాయి. దీని అడుగుభాగంలో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. బిల్లాలోని ప్రత్యేక పరిస్థితులు శిలాజాలను సంరక్షించడానికి తగిన వాతావరణాన్ని సృష్టిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా అంతరించపోయిన జాతులను గుర్తించడంలో ఇవి సహాయపడతాయట.













