గ్రామీ పురస్కారాల్లో జెలెన్స్కీ… మౌనం వల్లే ఉక్రెయిన్
గ్రామీ అవార్డులు 2022 కార్యక్రమలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. మౌనం వల్లే ఉక్రెయిన్ నాశనం అవుతోంది. ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఈ నిశబ్దాన్ని మీ సంగీతంతో పూరించండి. మా కథను ప్రపంచానికి చెప్పండి. వీలైన రీతిలో మాకు మద్దతు ప్రకటించండి. కానీ మౌనంగా మాత్రం ఉండకండి అంటూ విజ్ఞప్తి చేశారు. రష్యా దండయాత్ర నేపథ్యంలో తమకు మద్దతుగా నిలవాలని ప్రపంచ దేశాలను కోరుతూ వస్తున్న జెలెన్స్కీ గ్రామీ పురస్కారాల వేదికపై నుంచి సందేశమిచ్చారు. రష్యా దండ యాత్రను ఉక్రెయిన్ పౌరుల కలలు, జీవితాలను కూల్చివేసే భయంకరమైన నిశ్భబ్దంతో పోల్చారు. సంగీతానికి భిన్నమైనది ఏంటో తెలుసా? శవాల గుట్టలతో శిథిలమైన నగరాల్లో నెలకొన్న నిశ్శబద్ధం. మా గడ్డపై రష్యా బాంబులతో విరుచుకుపడుతూ భయంకరమైన నిశ్శబ్దాన్ని మిగిల్చింది. ఆ నిశ్శబ్దాన్ని మీ సంగీతంలో పూడ్చండి. మా కథను ప్రపంచానికి తెలియజేయండి అని అన్నారు.













