పుతిన్ క్షమాభిక్ష.. ఎందుకంటే
గర్ల్‌ఫ్రెండ్ తిరస్కరించిందనే కక్షతో ఆమెపై అత్యాచారానికి ప్పాడటంతో పాటు చిత్ర హింసలు పెట్టి, ఏకంగా 111 సార్లు పొడిచి అత్యంత క్రూరంగా హత్య చేశాడో యువకుడు. అయినా సరే, కటకటాల వెనుక ఏడాది కూడా గడపకుండానే విడుదలయ్యాడు. రష్యాకు చెందిన వ్లాడి స్లావ్ కన్యూస్ అనే యువకుడు వెరా పెఖైలెవాను ప్రేమించాడు. ఆ తర్వాత ఆమె అతడిని దూరంగా పెట్టింది. దాంతో ఆమెను బంధించి మూడున్నర గంటలపాటు చిత్రహింసలు పెట్టి చంపేశాడు. కోర్టు అతడికి 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కానీ ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొనేందుకు అతను అంగీకరించడంతో అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక ప్రకటించారు. కన్యూస్ను విడుదల చేసి ఉక్రెయిన్‌తో సరిహద్దుల్లోని రోస్తోవ్ నగరానికి తీసుకెళ్లారు.













